Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్సిడెంట్ కేసులో శ్రీలంక క్రికెటర్ కులశేఖర అరెస్టు...బెయిల్ పై విడుదల

శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన పేస్ బౌలర్ నువాన్ కులశేఖరను కొలంబో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంకలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కొలంబోకు పది మైళ్ల దూరంలోని కదావాతా ఏ-1 హైవేపై కారులో వెళ్తున్న కులశేఖర ఎదురుగా వస్తున్న మోటర్ సైక్లిస్ట్ ను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రగాయాల పాలైన ఆ వాహన దారుడు అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికే అతనిని బెయిల్ పై విడుదల చేశారు. గతేడాది శ్రీలంకలో రోడ్డు ప్రమాదాల వల్ల 2,700 మంది మృతి చెందగా అందులో సగం మంది ఏ-1 హైవేపై మృతి చెందడం గమనార్హం.

More Telugu News